“Agadha” Emerges: పలు సూపర్ హిట్స్ చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు.. దర్శకుడిగా రూపొందించిన తాజా చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఎంస్ రాజు మాట్లాడుతూ ‘ఫిల్మ్ మేకర్స్‌‌‌‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని రూపొందిస్తున్నా. ఈ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. విజువల్ వండర్‌‌‌‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆర్టిస్టులంతా ప్రాణం పెట్టి చేశారు’ అని అన్నారు.

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ‘మహాదేవి పాత్రలో నన్ను నమ్మిన రాజు గారికి థ్యాంక్స్. కొన్ని సినిమాలు మనతో నిత్యం ఉండిపోతాయి. ‘అగధ’ అలాంటి సినిమా అవుతుంది’ అని చెప్పింది. ఈ మూవీ అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత కాశీ విశాలాక్షి అన్నారు. నటులు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనితా విజయ్ కుమార్ ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story