Aishwarya as Megastar’s On-Screen Pair: మెగాస్టార్ కు జోడీగా ఐశ్వర్య.?
ఐశ్వర్య.?

Aishwarya as Megastar’s On-Screen Pair: మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు' విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనా లున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్ ల పేర్లు వినపడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటిం చబోతోందనే టాక్ వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం క్యా స్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రాని కి సంగీతం అందించబోతున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో చేయనున్నారట.కోల్ కతా బ్యాక్ ప్ లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేసిన ఈ సినిమా షూట్టింగ్ మార్చి 2026 నుంచి రెగ్యులర్ జరిగే చాన్స్ ఉందంటున్నారు.

