Arjun Tendulkar’s Wedding: అర్జున్ పెళ్లిలో ఐశ్వర్య, అభిషేక్
ఐశ్వర్య, అభిషేక్

Arjun Tendulkar’s Wedding: అర్జున్ టెండూల్కర్ ,సానియా చాందోక్ వివాహ వేడుకకు సినీ పరి శ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ జంటగా ఫోటోలు తీయించుకున్నారు. అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ కూడా సంప్రదాయ దు స్తుల్లో వేడుకలో పాల్గొన్నారు. అర్జున్ ముంబై, అస్సాం డొమెస్టిక్ క్రికెట్ ఆటతీశాడు, ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఉన్నాడు. సానియా సక్సెస్ ఫుల్ పెట్ స్పా వ్యాపారంలో గుర్తింపు పొందింది. ఈ జంట 2025 ఆగస్టు 13న ముంబైలోని గాయ్ నివాసంలో ప్రైవేట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ పరిచయం ద్వారా సానియాతో సమీపంగా కలిసాడు. పిలాటీస్, బ్రాంచ్లు, హాలిడేస్ ల తో ప్రారంభమైన స్నేహం, చివరికి ప్రేమ సంబంధంగా మారింది. ఈ వేడుకలో క్రికెట్ ప్రపంచానికి చెందిన తారలు మెరిశారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరై సందడి చేశారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే, అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవా జట్టుకు మారి డొమెస్టిక్ క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారి ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు.

