Ajith Clarifies: విజయ్ తో వైరం.. క్లారిటీ ఇచ్చిన హీరో అజిత్
క్లారిటీ ఇచ్చిన హీరో అజిత్

Ajith Clarifies: కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్,అజిత్ అభిమానులు తరచూ సోషల్ మీడియాల విమర్శలు చేసుకుంటారు. అజిత్ కు, విజయ్ కు ఒకరినొకరికి పడదని చర్చించుకుంటారు. ఈ క్రమంలో అజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయ్‌తో తనకు వైరం ఉందనే ఊహాగానాలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ విజయ్‌కు మంచి జరగాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. కొంతమంది తమ ఇంటర్వ్యూలను తప్పుగా ఉపయోగించి, తమ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారు మౌనంగా ఉండటం మంచిదని అన్నారు. అభిమానులు ఆన్‌లైన్ గొడవలకు దూరంగా ఉండి, తమ కుటుంబాలపై దృష్టి సారించి, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు.విజయ్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేశారు.
ఇటీవల కరూర్ (Karur) లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి అజిత్ కుమార్ స్పందించిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటకు కేవలం విజయ్ ఒక్కరే బాధ్యులు కారని, సమాజంలోని ప్రతి ఒక్కరూ, అభిమానులు,మీడియా కూడా బాధ్యత వహించాలని అన్నారు. పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఆకర్షించాలనే ధోరణిని ఆయన ప్రశ్నించారు.

