నందు ఫన్నీ వీడియో

Akhanda 2 Effect: డిసెంబర్ 12న బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదల కానుండటంతో ఆ తేదీకి రావాల్సిన చిన్న సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా శ్రీనందు హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం సైక్‌ సిద్ధార్థ కూడా వాయిదా పడింది. ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

ఈ విషయం తెలుపుతూ హీరో నందు.. ప్రముఖ నటుడు రానాతో కలిసి ఉన్న ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతకుముందు, డిసెంబర్ 12న విడుదల కావాల్సిన మోగ్లీ సినిమా కూడా అఖండ 2 కారణంగా ఒకరోజు వెనక్కు వెళ్లి విడుదల కానుంది.

అఖండ 2 విడుదల ప్రభావంతో చిన్న చిత్రాల మార్కెట్ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ వాయిదాలు కీలకమైనట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story