తొలిరోజు కలెక్షన్ల సునామీ

Akhanda 2 Storms the Box Office: నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ 2 బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలిరోజే ఏకంగా రూ. 59.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ వసూళ్లతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అఖండ 2 నిలిచింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.

2021లో విడుదలై సంచలనం సృష్టించిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందింది. ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ నటన, బోయపాటి శ్రీను మాస్ టేకింగ్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనగానే నెలకొన్న భారీ అంచనాలు, కలెక్షన్ల రూపంలో నిజం కావడం విశేషం.

PolitEnt Media

PolitEnt Media

Next Story