Akhanda 2 Tandavam Song Released: అఖండ 2 తాండవం సాంగ్..గూస్ బంప్స్ పక్కా
గూస్ బంప్స్ పక్కా

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తుండగా, నాగసాధువు (అఘోరా) పాత్ర మరింత ఊహించని కోణంలో ఉంటుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా 'అఖండ 2: తాండవం' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ లేదా ఫస్ట్ సింగిల్ అయిన 'ది తాండవం' పాటను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ పాటను నవంబర్ 14 (శుక్రవారం) న విడుదల చేశారు.ఈ పాటను ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, చిత్ర బృందం సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ పాట.. మొదటి భాగంలో ఉన్న 'అఖండ' టైటిల్ ట్రాక్‌ను మించిపోయేలా అద్భుతమైన ఎనర్జీతో, పవర్ ఫుల్ బీట్‌తో ఉంది. పాట సాహిత్యం మొత్తం శివుని పరాక్రమం, సనాతన ధర్మం, అఖండ పాత్ర యొక్క శక్తిని ఆవిష్కరిస్తూ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. పాటను కళ్యాణ్ చక్రవర్తి రచించారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ సందర్భంగా తమ సినిమా విజయంపై, సనాతన ధర్మంపై ఎక్కువ దృష్టి సారించామని బాలకృష్ణ అన్నారు.ఈ సినిమాను నేను ప్యాన్ ఇండియా లేదా ప్యాన్ వరల్డ్ అనను. ఇది 'ప్యాన్ యూనివర్స్ ఫిల్మ్'. ఎందుకంటే ఇది దేవుడి సినిమా, సనాతన ధర్మాన్ని నిలబెట్టే సినిమా అని అన్నారు.బోయపాటి శ్రీనుతో నా అనుబంధం చాలా గొప్పది. మేము ముగ్గురం (బాలకృష్ణ, బోయపాటి, తమన్) కలిస్తే ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. ఈసారి బోయపాటి కథ, కథనంతో నన్ను ఆశ్చర్యపరిచాడు. అని అన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5, 2025 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

