దసరాకు థియేటర్లో తాండవమే..

Akhanda 2 Teaser: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో నాలుగేళ్ల తర్వాత అఖండకు సీక్వెల్‌‌గా అఖండ2 తో వస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అఖండ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలయ్య బర్త్ డేకి ఒకరోజు ముందే టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చారు. టీజర్ పవర్ ఫుల్గా సాగింది.

మాస్‌ యాక్షన్‌ కాన్సెప్ట్తో అఖండ 2 తెరకెక్కినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన ఉగ్రరూపంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 'థియేటర్లో తాండవం మొదలవ్వనుందనే హింట్ ఇచ్చింది ఈ టీజర్. దానికితోడు తమన్ BGM, బాలకృష్ణ మాస్ ఎలివేషన్కు ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్లో హైలెట్గా నిలిచింది. మొత్తానికి అఖండ 2 టీజర్ బాలయ్య అభిమానులకు గూసుబంప్స్ తెప్పిస్తుంది.

అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్‌‌గా దీన్ని విడుదల చేయబోతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story