Akhil Fans Want a Name Change: అఖిల్ పేరు మార్చాలంటున్న అక్కినేని ఫ్యాన్స్.. నాగ అఖిల్ వెనుక ఉన్న క్రేజీ సెంటిమెంట్ ఇదే..
క్రేజీ సెంటిమెంట్ ఇదే..

Akhil Fans Want a Name Change: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తోన్న తాజా యాక్షన్ డ్రామా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలంతో అత్యంత అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అఖిల్, నాగార్జునల స్పీచ్ కంటే.. ఓ వీరాభిమాని వేదికపై చేసిన వినూత్న ప్రతిపాదన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన అభిమాన హీరో సక్సెస్ కోసం ఆ అభిమాని సూచించిన పేరు, దాని వెనుక ఉన్న సెంటిమెంట్ వివరాలు ఇలా ఉన్నాయి..
అఖిల్ కాదింక.. నాగ అఖిల్..
సాధారణంగా హీరోలు సక్సెస్ కోసం జ్యోతిష్యం లేదా న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకుంటారు. కానీ, ఇక్కడ ఓ అభిమాని అఖిల్ కోసం నాగ అఖిల్ అనే సరికొత్త పేరును ప్రతిపాదించాడు. ఈ పేరు వెనుక అక్కినేని కుటుంబానికి చెందిన నలుగురు ముఖ్యుల ఆశీస్సులు బలంగా ఉన్నాయని ఆ ఫ్యాన్ వివరించిన తీరు వేదికపై ఉన్న నాగార్జున, అఖిల్‌లను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆ పేరు వెనుక ఉన్న నలుగురి సెంటిమెంట్..
అభిమాని వివరణ ప్రకారం నాగ అఖిల్ అనే పేరులో అక్కినేని వంశ పెద్దల పేర్లు దాగున్నాయి. అక్కినేని లెజెండ్ నాగేశ్వరరావు కింగ్ నాగార్జునల పేర్ల లోని మొదటి పదం. అఖిల్ పేరులోని మొదటి అక్షరం అ.. నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమలల పేర్ల మొదటి అక్షరానికి ప్రతీక. ఇలా కుటుంబంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తుల దీవెనలు ఎల్లప్పుడూ అఖిల్‌కు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పేరును సూచించినట్లు సదరు అభిమాని చెప్పడంతో తిరుపతి గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.
అక్కినేని వంశంలో నాగ కనెక్టివిటీ
నిజానికి అక్కినేని ఫ్యామిలీలో నాగ అనే పదానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్, సక్సెస్ రేట్ ఉన్నాయి. ఏఎన్నార్ నుంచి మొదలై నాగార్జున, నాగ చైతన్య, నాగ సుశీల వరకు అందరి పేర్లలోనూ ఇది భాగమైంది. ఇప్పుడు అఖిల్ కూడా అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తే తిరుగుండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ అభిమాని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "అభిమాని ఆలోచన అద్భుతంగా ఉంది", "నాగ అఖిల్ అనే పేరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జూలై 10న రాబోతున్న లెనిన్ చిత్రం కనుక బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే.. అఖిల్ ఇకపై ఇదే పేరును అధికారికంగా వాడుకుంటే బాగుంటుందని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

