Akhil's 'Lenin': టాలీవుడ్ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘లెనిన్’. మాస్ , యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ అఖిల్ ఖాతాలో తొలి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను చేర్చింది.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున,సూర్యదేవర నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. జూలై 10న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసల వర్షాన్ని కురిపించింది. 90వ దశకంలో చిత్తూరు జిల్లా సరిహద్దుల నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ పూర్తి రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఊపేసారు. ఆయనలోని సరికొత్త మాస్ యాంగిల్‌ను ఈ సినిమా బ్ర్యూట్‌గా ప్రజెంట్ చేసింది. ఇక ఇందులో అందాలభామ భాగ్యశ్రీ బోర్సే తన అభినయంతో, గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు.

డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు పకడ్బందీ కథ, కథనాలతో పాటు.. ఎస్.ఎస్. తమన్ అందించిన దద్దరిల్లే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, లియోన్ బ్రిట్టో అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి క్రిస్పీ ఎడిటింగ్ ఈ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ చిత్రం.. ఇప్పుడు మీ ఇంటి ముందర ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది.

అక్కినేని నాగార్జున పుట్టినరోజు నెల అయిన ఈ ఆగస్టులో.. ప్రేక్షకులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తోంది ‘లెనిన్’ టీమ్. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘జీ5’ (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు నా బర్త్‌డే మంత్. థియేటర్లలో ‘లెనిన్’కు ప్రేక్షకులు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి ఈ సినిమా మీ ఇంటికే వస్తోంది. కుటుంబంతో కలిసి చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి’’ అని పిలుపునిచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story