Akhil’s ‘Lenin’: అఖిల్ 'లెనిన్' .. 'వారెవ్వా వారెవ్వా' పాటకు హ్యూజ్ రెస్పాన్స్
'వారెవ్వా వారెవ్వా' పాటకు హ్యూజ్ రెస్పాన్స్

Akhil’s ‘Lenin’: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట “వారెవ్వా వారెవ్వా” ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయడమే కాకుండా, అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెనిన్' సినిమా సంగీత ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. జనవరి 5న విడుదలైన “వారెవ్వా వారెవ్వా” సాంగ్ మెలోడీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఎస్. తమన్ అందించిన స్వరాలు, మనసుకు హత్తుకునే సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా అఖిల్ అక్కినేని తన లుక్స్‌తో ఆకట్టుకోగా, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన మార్కును చాటుకున్నారు. రొమాంటిక్ మూడ్‌తో సాగే ఈ పాటను విజువల్ గా కూడా చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారు. "వారెవ్వా వారెవ్వా" అనే పల్లవి శ్రోతల నోళ్లలో నానుతూ, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తోంది. సినిమాలోని ఎమోషనల్,రొమాంటిక్ యాంగిల్‌ను ఈ పాట చక్కగా ప్రతిబింబిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'లెనిన్' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి, సినిమాను 2026 వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మనమ్ ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ పాటతో అఖిల్ కెరీర్‌లో మరో మ్యూజికల్ హిట్ పక్కా అని అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వేసవిలో 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

