Akhil's Special Wishes: సమంతకు అఖిల్ స్పెషల్ విషెస్.. ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో అఖిల్ క్రేజీ కామెంట్స్!
అఖిల్ క్రేజీ కామెంట్స్!

Akhil's Special Wishes: అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ ఇండస్ట్రీ హిట్ ‘మా ఇంటి బంగారం’ సినిమాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు!
‘‘నేను ‘లెనిన్’ ప్రమోషన్స్ బిజీలో ఉండడం వల్ల ఇంకా ‘మా ఇంటి బంగారం’ సినిమా చూడలేదు. కానీ, ఆ చిత్ర ట్రైలర్ చూశాను.. నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని ముందే అనిపించింది. కథ కూడా చాలా సహజంగా ఉంది’’ అని అఖిల్ పేర్కొన్నారు.
ఇక సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్లి, వాళ్లందరితో 'బంగారం' అనిపించుకోవాలనే ఎమోషనల్ పాయింట్‌తో పాటు.. సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా గ్రేట్! సమంత చాలా అద్భుతంగా నటించారు. కంగ్రాట్స్ సామ్’’ అంటూ సమంతతో పాటు ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందానికి అఖిల్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

