Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై ప్రస్తుతం పూర్తి దృష్టి సారించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'లాటరీ కింగ్' లేదా 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ప్రొడక్షన్ విలువలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంలోనే చాలా కాలం తర్వాత నాగార్జున సరసన సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, ఈ మైలురాయి చిత్రంలో నాగచైతన్య, అఖిల్ కూడా ప్రత్యేక పాత్రల్లో మెరిసే అవకాశం ఉందనే వార్తలు అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా ఫస్ట్ లుక్ గ్లింప్స్ బయటకు రాలేదు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, వచ్చే నెలలో రాబోయే నాగార్జున పుట్టినరోజు (ఆగస్టు) కానుకగా ఈ 100వ సినిమా అధికారిక టైటిల్ మరియు టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్వాలిటీకి ప్రాధాన్యతనిస్తూ, చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో లేదా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story