Akshay Kumar’s Daughter: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను ఆన్‌లైన్ వేదికగా వేధించిన నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు కస్టడీలోకి తీసుకున్నారు.గత కొంతకాలంగా సాగుతున్న ఈ కేసు విచారణలో నిందితుడిని పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు విజయం సాధించారు.

అసలు ఏం జరిగిందంటే.. గతేడాది ఒక కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్, తన కుమార్తె ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమె న్యూడ్ ఫొటోలు పంపాలంటూ అసభ్యకరమైన డిమాండ్లు చేశాడని అక్షయ్ వెల్లడించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే అక్షయ్ కుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడి ఆచూకీని కనిపెట్టారు. ఏడీజీపీ యశస్వీ యాదవ్ ఈ అరెస్టును ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

ఈ కేసులో అక్షయ్ కుమార్ కుమార్తె చూపిన ధైర్యాన్ని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె భయపడకుండా జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని ఏడీజీపీ తెలిపారు. ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే నిందితులకు శిక్ష పడుతుందని ఆయన తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story