Alia Bhatt and Ranbir Kapoor: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన అలియా రణ్ బీర్ దంపతులు
అలియా రణ్ బీర్ దంపతులు

Alia Bhatt and Ranbir Kapoor: బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తమ కలల ఇంటిలో ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. ఆలియా, రణ్‌బీర్ వారి కుమార్తె రాహా కపూర్ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం, పాలి హిల్ లోని కృష్ణరాజ్ అనే బంగ్లాలోకి ప్రవేశించారు.
ఇది రణ్‌బీర్ కపూర్ కుటుంబానికి చెందిన పాత బంగ్లా స్థానంలో కొత్తగా నిర్మించిన భవనం. దీని నిర్మాణం పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది.ఈ భారీ ఆరు అంతస్తుల భవనం విలువ సుమారుగా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆలియా భట్ తమ సోషల్ మీడియాలో ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ఇంటిలోకి మొదటి అడుగు వేశారు.నవంబర్ 2025లో కుమార్తె రాహా (Raha) మూడవ పుట్టినరోజు వేడుక కూడా జరిగింది. ఆలియా తన పోస్ట్‌లో పుట్టినరోజు వేడుకల ఫోటోలను కూడా పంచుకున్నారు.
గృహప్రవేశ పూజలో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఆలియా , రణ్‌బీర్ సంప్రదాయ దుస్తులు ధరించి, కలశం తీసుకురావడం, పూజలు చేయడం వంటి ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
ఈ బంగ్లాను ఆలియా, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ కలిసి డిజైన్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలుస్తోంది, ఇది వారి కుటుంబ వారసత్వం,ఆధునికతను ప్రతిబింబిస్తుంది.

