‘Dragon’: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా 'డ్రాగన్' గురించే చర్చ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది!

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియా భట్ నటించినప్పటికీ.. ఆమె రామ్ చరణ్ సరసన జోడీగా కనిపించింది. అప్పట్నుంచే ఎన్టీఆర్, అలియా భట్ జోడీని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఇప్పుడు ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీతో నెరవేరబోతోంది! ఈ చిత్రంలో ఇప్పటికే రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్ర లేదా జోడీ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలోని విలన్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఢీకొనే పవర్‌ఫుల్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు.

షూటింగ్ విశేషాలకు వస్తే.. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి చిన్న ఆపరేషన్ జరగడంతో కొద్ది వారాల పాటు షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడింది. అయితే త్వరలోనే ఆ బ్రేక్ ముగియనుండగా, మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ముందుగా అనౌన్స్ చేసినట్లుగానే సరిగ్గా జూన్ నెలలో ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి 'డ్రాగన్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి తారక్ అండ్ నీల్ కాంబో సిద్ధమవుతోంది

Next Story