పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Allari Naresh’s “12A Railway Colony”: అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఉదయం షోలు, మొదటి రోజు ఆటలు చూసిన ప్రేక్షకుల పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు.

సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్,హారర్ అంశాల చుట్టూ తిరుగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ 'అల్లరి నరేష్' కామెడీ సినిమా కాదని స్పష్టమవుతోంది. మొదటి భాగంలో హీరో పాత్ర ప్రయాణం, థ్రిల్ ఎలిమెంట్స్‌ను బాగా ఎస్టాబ్లిష్ చేశారని, సెకండాఫ్‌లోని కొన్ని ట్విస్ట్‌లు (Twists) ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.

కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగిందని, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువగా అనిపించాయని కొంతమంది చెబుతున్నారు.

నాంది', 'ఉగ్రం' తరహాలో ఈ థ్రిల్లర్ పాత్రను కూడా నరేష్ బాగా పోషించారని, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన బాగుందని ప్రశంసలు దక్కాయి.

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల,సాయి కుమార్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రేక్షకులు తెలిపారు.

భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా థ్రిల్ మూడ్‌ను పెంచడంలో సహాయపడింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయని, ముఖ్యంగా కెమెరా పనితనం థ్రిల్లర్‌కు కావాల్సిన వాతావరణాన్ని అందించింది.సినిమాలోని సస్పెన్స్ క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసిందని, 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే బలం కొన్ని చోట్ల కనిపించిందని అంటున్నారు.

మొదటి రోజు 'పబ్లిక్ టాక్' ప్రకారం, '12A రైల్వే కాలనీ' సస్పెన్స్, హారర్ అంశాలు నచ్చే ప్రేక్షకులకు ఒక మంచి వీక్షణ అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో లేకపోయినా, థ్రిల్లర్ లవర్స్‌కు నచ్చే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story