ఇది నిజంగా సిగ్గుచేటు..

Dharmendra: లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్ లో నిర్వహించిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీరంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావు, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. అయితే ఆస్కార్ నివాళి అర్పించిన జాబితాలో దర్మేంద్ర పేరు లేకపోవడంతో ఆయన భార్య హేమ మాలిని స్పందించింది. ఆస్కార్ వేదికపై ప్రసారం చేసిన మెమోరియం లైవ్ టెలికాస్ట్ లో ధర్మేంద్ర ఫొటో లేకపోవడంపై ఫైర్ అయ్యింది.

'ఇది నిజంగా సిగ్గుచేటు మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు. ధర్మేంద్ర తన కెరీర్ లో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు అలాంటప్పుడు ఆయన ఆస్కార్ల గురించి ఎందుకు పట్టించు కోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. బాల్ పత్తర్, మీరా చిత్రాలలోని ఉత్తమ నటనకు నాకు కూడా ఏ అవార్డూ రాలేదు. వ్యక్తిగతంగా, ధరంజీ వీటన్నిటి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు! ఆయన అభిమానులు ప్రేమ అన్నింటికన్నా గొప్పది'అని చెప్పుకొచ్చింది. అయితే లైవ్ టెలికాస్ట్‌లో ఆయన పేరు లేకపోయినప్పటికీ, అకాడమీ అధికారిక వెబ్‌సైట్ గ్యాలరీలో ఆయన పేరును చేర్చడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story