టైటిల్ రాకా

Allu Arjun–Atlee Movie Title: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఇన్నాళ్లు AA22xA6 వర్కింగ్ టైటిల్‌తో సైలెంట్‌గా ఉన్న మేకర్స్ ... నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. అదే రాకా (RAAKA).

మృగం కంటే క్రూరంగా మనిషి కంటే తెలివిగా, ఆ పదునైన వేలి గోళ్లు, వేటగాడి రౌద్రంతో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది... ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇప్పటివరకు చూడని ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ అని అర్థమవుతోంది. ఇప్పటికే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం... మనిషిలోని మృగాన్ని పరిచయం చేయబోతోంది. బన్నీ గెటప్ చూస్తుంటే షాకింగ్ అనిపించక మానదు.

"ఇప్పటివరకు మీరు చూసింది ఒక వెర్షన్ మాత్రమే... కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ చూపించబోయేది ఊహకు అందని ఒక విజువల్ వండర్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, హాలీవుడ్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో అట్లీ సృష్టిస్తున్న అంతర్జాతీయ స్థాయి మాయాజాలం రాకా.

ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ వేటాడేది ఆయనే... వేటాడబడేది ఆయనే! హీరో అల్లు అర్జున్ అయితే... విలన్ కూడా అల్లు అర్జునే! ఇప్పుడు బయటకు వచ్చిన ఈ రౌద్ర రూపం... రాకా'లోని నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర మాత్రమే.సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో బన్నీ ఏకంగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. విలన్ లుక్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్... ఇక హీరోగా ఏ రేంజ్ లో ఉంటారో అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ని మార్చడానికి వస్తున్న ఈ గ్రాండియర్... 2026 దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో బ్లాస్టింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story