అల్లు శిరీష్ -నయనిక వివాహం

Allu Sirish and Nayanika Wedding Ceremony: అల్లు శిరీష్ పెళ్లి అత్యంత వైభవంగ జరిగింది. అల్లు శిరీష్, తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ నయనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.ఈ వేడుక నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగింది.

హైదరాబాద్‌లోని కొల్లూరులో ఉన్న 'ఐనా ఈవెంట్ స్పేస్' (Aina Event Space)లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

విశేషమేమిటంటే, సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే రోజున అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. ఇప్పుడు అదే తేదీన తమ్ముడు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు.

ముఖ్య అతిథులు

ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ - ఉపాసన, పవన్ కళ్యాణ్, సూర్య, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వంటి స్టార్ హీరోలు కుటుంబ సమేతంగా విచ్చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story