Allu Sirish’s Haldi Function: అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్ సందడి
హల్దీ ఫంక్షన్ సందడి

Allu Sirish’s Haldi Function: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో పెళ్లి భాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అల్లు శిరీష్ నయనికల వివాహం మార్చి 6న హైద రాబాద్లో ఘనంగా జరగనుంది. మ్యారేజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తాజాగా అల్లు అరవింద్ నివాసంలో హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దకుమార్తె సుష్మిత, కోడలు ఉపాసన, బన్నీ భార్య స్నేహ రెడ్డి, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, సహా ఇతర బంధువులు, చిన్నారు లు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను అల్లు శిరీష్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే తన తమ్ముడి జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టానికి అన్న అల్లు అర్జున్ హాజరుకాలేకపో యాడు. ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్ పనుల్లో దేశం వెలుపల బిజీగా ఉండటం వల్లే బన్నీ ఈ వేడుకకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఒక ఎమో షనల్ పోస్ట్ షేర్ చేశాడు. తమ్ముడి హల్దీ ఫొటోను పోస్ట్ చేస్తూ. ‘ఐ మిస్డ్ బీయింగ్ హియర్' అంటూ తన ఆవే దనను వ్యక్త పరిచాడు.

