Ram Charan's Special Post: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం నేడు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన సానుకూల స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతున్న తరుణంలో మెగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన అభినందనలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

సమంత ఒక ఎనర్జీ.. ఎక్స్ వేదికగా చరణ్ ట్వీట్..

రామ్ చరణ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సమంతను అభినందిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "ప్రియమైన సమంత.. మీరు ఎల్లప్పుడూ అసాధారణమైన శక్తి, సౌందర్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ. మా ఇంటి బంగారం సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నాను. ఈ ఘన విజయాన్ని అందుకున్న మీకు, అలాగే చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి సక్సెస్ పట్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను." అని రామ్ చరణ్ అన్నారు.

ఈ మెగా ప్రశంసలపై సమంత వెంటనే స్పందించారు. చరణ్ అన్న మాటలు తనకు, తన చిత్ర బృందానికి ఎంతో విలువైనవని చెబుతూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

డూప్ లేకుండా యాక్షన్.. సమంత వన్ ఉమెన్ షో..

సమంత కెరీర్‌లో ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మయోసైటిస్ అనే ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ వ్యాధితో సుదీర్ఘకాలం పోరాడి, సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆమె చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మించడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలోని హై-వోల్టేజ్ వాస్తవిక యాక్షన్ సీన్స్‌లో ఆమె ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా స్వయంగా నటించి మెప్పించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story