Ananya Nagalla: ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై టాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇటీవల మరింత ముదిరింది. ముఖ్యంగా విష్ణుప్రియ భీమనేనికి సంబంధించిన కంటెంట్ వైరల్ కావడంతో ఈ అంశంపై వివాదం రేగింది. ఈ క్రమంలోనే నటి అనన్య నాగళ్ల కూడా సోషల్ మీడియా ఊహాగానాలకు కేంద్రబిందువుగా మారారు. ఆమె తన సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంచుకుంటున్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది.

ఈ ఆరోపణలపై అనన్య స్పందిస్తూ తాను ఏప్రిల్ 7, 2025న ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించిన సమయంలో రికార్డ్ చేసిన ఒక వీడియోను షేర్ చేశారు. తన సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవ కోసం వినియోగించాలన్నదే తన ఉద్దేశమని, అలాగే తన సబ్‌స్క్రైబర్లతో భక్తిరసమైన మరియు అర్థవంతమైన విషయాలను పంచుకుంటున్నానని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేశారు.

తాను ఎప్పుడూ అసభ్యకరమైన లేదా వల్గర్ మెటీరియల్‌ను పోస్ట్ చేయలేదని ఆమె గట్టిగా తిప్పికొట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి వస్తున్న అనవసరమైన కామెంట్లపై క్లారిటీ ఇస్తున్నానని చెబుతూ ఈ వీడియోను పంచుకున్నారు. వాస్తవాలు తెలియకుండా ఒక నిర్ణయానికి రావద్దని ఆమె ప్రజలను కోరారు. ఏదైనా విషయాన్ని ప్రచారం చేసే ముందు లేదా స్పందించే ముందు నిజానిజాలు సరిచూసుకోవాలని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యమని అనన్య నాగళ్ల విజ్ఞప్తి చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story