Anirudh Ravichander : దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. డీసీ పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. వామిక గబ్బి హీరోయిన్. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి. దేవదాస్ పార్వతీ చంద్రముఖి కాన్సెప్ట్ తో ఎక్స్ ట్రీమ్ వాయిలెన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాలతోదర్శకుడిగా పాపులారిటీ సొంతం చేసుకుని..


హీరోగా కూడా అదే తరహా సినిమాతో ఎంట్రీ ఇస్తున్న లోకేశ్పై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లోకేశ్ దర్శకత్వం వహించిన సినిమాలకు మాత్రమే మ్యూజిక్ కంపోజ్ చేస్తాడట. ఆయన హీరోగా నటించిన సినిమాలకు చేయనని తేల్చి చెప్పాడు. అనిరుధ్ ఏమైనా హీరో కావాలనే ఆలోచనలో ఉన్నాడా? అంటే అదీ లేదట. తాను మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story