మరో క్రేజీ అప్ డేట్

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న'స్పిరిట్' పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైవ్ క్రియేట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీక రణ జరుగుతుండగా. అది పూర్తయ్యిన వెంటనే ఒక గ్రాండ్ సాంగ్ ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాస్ చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ పాటలో ప్రభాస్ స్టెప్స్ తో పాటు దిమ్రి గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్ప్ ఈ పాటను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంట ర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కథలోని ఎమోషన్, యాక్షన్కు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story