Kiara Advani: కియారా అద్వానీకి మరోసారి గుడ్ న్యూస్.. రెండో బిడ్డకు తల్లికాబోతున్న నటి
రెండో బిడ్డకు తల్లికాబోతున్న నటి

Kiara Advani: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా గుడ్ న్యూస్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవలే దీపికా పదుకొణె రెండో బిడ్డకు జన్మనివ్వగా.. నటి సమంత తన తొలి ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ కూడా అభిమానులతో ఓ గుడ్ న్యూస్ పంచుకుంది.
కియారా అద్వానీ, ఆమె భర్త, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 7, బుధవారం ఈ విషయాన్ని ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
“మరోసారి మా జీవితంలోకి గొప్ప బహుమతి రాబోతోంది. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
కియారా, సిద్ధార్థ్ దంపతులు తమ మొదటి బిడ్డకు గతేడాది జూలైలో స్వాగతం పలికారు. వారికి సారాయా మల్హోత్రా అనే కుమార్తె ఉంది. మొదటి బిడ్డ పుట్టిన ఏడాది దాటిన సమయంలోనే ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడం విశేషం.
ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ కోసం కియారా ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేసింది. అందులో వారి కుమార్తె సారాయా చిన్న పాదంతో పాటు.. ఓ పెద్దవారి చేతిపై ఉంచిన తెల్లటి అల్లిన చిన్న బేబీ సాక్స్ కనిపించాయి. ఈ ఫొటో ద్వారా తమ రెండో బిడ్డ రాబోతున్న విషయాన్ని కియారా, సిద్ధార్థ్ తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. కియారా అద్వానీ ఇటీవల ‘టాక్సిక్’ సినిమాలో కనిపించింది. అంతేకాకుండా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పలు తెలుగు సినిమాల్లో కియారా నటించింది.

