Another Powerful Track from ‘Peddi’: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్ విడుదలైంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా "మస్సా మస్సా" అంటూ సాగే పవర్‌ఫుల్ ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది.

ఇక ఈ పాట విషయానికి వస్తే.. ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తినింపేలా ఉంది. ఈ పవర్‌ఫుల్ గీతాన్ని టాలెంటెడ్ సింగర్ విశాల్ మిశ్రా తనదైన స్టైల్లో అద్భుతంగా పాడారు. ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అందించిన ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, అతని టెంపర్‌మెంట్ ఎలా ఉండబోతుందో అద్దం పట్టేలా ఈ సాంగ్ సాగుతోంది.

కేవలం ఈ ఒక్క పాట మాత్రమే కాదు.. మెగా అభిమానులకు డబుల్ ధమాకా ఇస్తూ చిత్ర బృందం ‘పెద్ది’ ఆడియో జ్యూక్ బాక్స్‌ను కూడా ఒకేసారి రిలీజ్ చేసింది. ఇందులో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న చికిరి చికిరి, రయ్ రయ్ రారా", "హల్లల్లలో" లాంటి అదిరిపోయే పాటలన్నింటినీ ఒకే చోట వినేలా డిజైన్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అందించిన మ్యూజికల్ ఆల్బమ్.. రాబోయే రోజుల్లో చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పక్కా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరి అన్ని హంగులతో, సరికొత్త మాస్ ఎనర్జీతో వస్తున్న ‘పెద్ది’.. జూన్ 4న థియేటర్లలో ఎలాంటి రికార్డులను వేటాడబోతుందో చూడాలి!.

PolitEnt Media

PolitEnt Media

Next Story