Another Star from the Allu family: అల్లు కుటుంబం నుంచి మరో స్టార్ రానున్నాడు. అల్లురామలింగయ్య వారసత్వాన్ని ఆయన కొడుకు అల్లుఅరవింద్ అగ్ర నిర్మాతగా కొనసాగిస్తుంటే.. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన నటనతో లెగసీని ముందుకు నడిపిస్తున్నాడు.ఇప్పుడు అదే బాటలో అల్లు అయాన్ కూడా నటుడు అవుతాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయాన్ తీరిక సమయాల్లో ఇంట్లోవేషాలు వేస్తూ ఉంటే, అతడి భవితవ్యం ఎలా ఉంటుందో తాత అల్లు అరవింద్ ముందే ఊహించాడు.

అందుకే ఏఏఏ సినిమాస్- కోకాపేట మల్టీఫ్లెక్స్ లాంచ్ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'అయాన్ ఇప్పుడే ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. నాలుగో తరం కూడా వచ్చేసింది' అని స్వయంగా వెల్లడించాడు. ఇది అల్లు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ఎదిగి పుష్ప ఫ్రాంఛైజీ చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ బాక్సా ఫీస్ ను ఏలే సత్తా ఉన్నహీరోగా బన్నీ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్నాడు.

Next Story