Parada Movie: ప్రైమ్ లోకి అనుపమా పరమేశ్వరన్ పరదా
అనుపమా పరమేశ్వరన్ పరదా

Parada Movie: అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా పరదా. ‘సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివా సులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కనుక చూస్తే హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంతోనే ఈ సినిమా తెరకెక్కించినట్టు అని పిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 22న ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది.
కంటెంట్ పట్ల ఉన్న నమ్మ కంతోనే ప్రైమ్ వారు ముందుగా ఈ డీల్ క్లోజ్ చేశారని టాక్ . ఈ చిత్రంలో అనుపమకు తోడు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలో కనిపించను న్నారు. అనుపమ తో కలిసి వారి పాత్రలు కూడా కథలో కీలక మలుపులు తిప్పబోతున్నాయని సమాచారం. అనుపమ ఈ సినిమాతో నటిగా మరింత ఎదుగుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.
