నాగ్ కు జోడీగా అనుష్క.!

King 100: కింగ్ నాగార్జున ప్రస్తుతం తన సినీ కెరీర్లో కీలక మైలురాయి నిలిచే 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని సమాచారం ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ సినిమాలో టబు కూడా మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. కథ రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాత్ర సాధారణ వ్యక్తిగా, మరో పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంటుందని టాక్. అంతే కాకుండా ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో మరో స్టార్ హీరో క్యామియోగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఈ మూవీలో అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తోందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్, డాన్, ఢమరుకం వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. నాగార్జున, అనుష్క శెట్టి మధ్య ఉండే ప్రత్యేకమైన కెమిస్ట్రీని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆమెను సంప్రదించగా, కథ నచ్చడంతో అనుష్క సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story