హిట్టా.?ఫట్టా?

Anushka's Ghaati Public Talk: అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కించిన 'ఘాటీ' ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన పబ్లిక్ ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో తెలుసుకుందాం

చాలామంది ప్రేక్షకులు అనుష్క శెట్టి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె 'శీలావతి' పాత్రలో ఒదిగిపోయిన తీరు, యాక్షన్ సన్నివేశాల్లో చూపిన అభినయం హైలైట్‌గా నిలిచాయని చెబుతున్నారు. కొంతమంది "కాటేరమ్మ కొడుకు" ఫైట్ సీన్‌ను గుర్తు చేస్తూ అనుష్క చేసిన పోరాట సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, అవి సినిమాకు ప్లస్ గా మారాయని అంటున్నారు. గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చిన కథ కొంతవరకు ఆసక్తికరంగా ఉందని టాక్.కొంతమంది ప్రేక్షకులు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం, టేకింగ్‌ను మెచ్చుకుంటున్నారు.

సినిమా కథనం కొత్తగా లేదని, కొన్ని సన్నివేశాలు ఊహించే విధంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.సినిమా సెకండ్ హాఫ్ వేగం తగ్గిందని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తంగా అనుష్క నటన, ఎమోషనల్ సీన్స్ కోసంఘాటీని ఒకసారి చూడవచ్చని చాలామంది చెబుతున్నారు. మీద మిక్స్‌డ్ టాక్ వస్తున్నందున బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story