Arjun Chakravarthy Movie: రిలీజ్ కు ముందే 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్
46 ఇంటర్నేషనల్ అవార్డ్స్

Arjun Chakravarthy Movie: విజయ రామరాజు హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా 'అర్జున్ చక్రవర్తి'. ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మించారు. ఇది నల్గొండకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు నాగులయ్య జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది.
ఈ సినిమా విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా తెలుగు , తమిళ భాషలలో చిత్రీకరించబడింది, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేసి పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. విఘ్నేష్ భాస్కరన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.
ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసిన టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఒక నిమిషం ఉన్న ఈ టీజర్ కబడ్డీ ప్లేయర్‌గా విజయ రామరాజు అద్భుతమైన ప్రయాణాన్ని చూపిస్తుంది. అతని పాత రూపం నుంచి చాంపియన్‌గా మారే క్రమాన్ని టీజర్ చాలా ఆసక్తికరంగా చూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. అలాగే, యూట్యూబ్‌లో 1.5 మిలియన్లు వ్యూస్‌ను క్రాస్ చేసేసింది.
