అరుంధ‌తి చైల్డ్ ఆర్టిస్ట్‌?

Arundhati Child Artist: ‘అరుంధతి’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించిన దివ్య నాగేశ్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఆమె అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అయిన అజయ్ కుమార్‌తో ప్రేమలో ఉన్న దివ్య, ఈ ఏడాది జనవరిలో అతనితో నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి ఈ నెల ఆగస్ట్ 18న జరగనుంది. ప్రస్తుతం దివ్య వెడ్డింగ్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంది. తాజాగా, తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ జరుపుకున్న దివ్య, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దివ్య నాగేశ్ చిన్నతనంలోనే నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల వయసు నుంచే ఆమె తమిళం, తెలుగు భాషలలో దాదాపు 40కి పైగా సినిమాలలో, 60కి పైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. అరుంధతితో పాటు ‘బిల్లా’, ‘కంత్రి’ వంటి పలు సినిమాలలో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తమిళంలో ‘పోయి’, ‘జిల్లూను ఒరు కాదల్’, ‘శైవం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించారు. అలాగే, ‘నేను నాన్న అబద్దం’ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటించారు. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తర్వాత, ఆమె కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిగా, మోడల్‌గా మరియు డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story