నన్నెవరూ ఆపలేరు

NTR: వార్ 2 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రయాణం గురించి, అభిమానుల ప్రేమ గురించి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. తన సినీ ప్రస్థానంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన 25 సంవత్సరాల సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, మొదట తన పక్కన తన తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరని ఎమోషనల్ అయ్యారు.తన తాతగారు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని చెప్పారు.వార్ 2' సినిమా చేయడానికి కథ, స్క్రిప్ట్ కాదు, కేవలం నిర్మాత ఆదిత్య చోప్రా గారిపై ఉన్న నమ్మకమే కారణమని తెలిపారు.

తనను కడుపులో పెట్టుకుని, ఎప్పుడూ తన ఆనందం, బాధలను పంచుకున్న అభిమానులకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని, జీవితాంతం వాళ్లను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటానని చెప్పారు. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లోకి తనని ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇద్దరు పెద్ద స్టార్స్‌ను ఒకే సినిమాలో పెట్టుకొని ఇంత అద్భుతంగా సినిమా తీయడం దర్శకుడు అయాన్ ముఖర్జీకే సాధ్యమైందని ప్రశంసించారు . అయాన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు అని కొనియాడారు. హృతిక్ రోషన్‌తో తన అనుభవాన్ని పంచుకుంటూ 25 సంవత్సరాల క్రితం 'కహోనా ప్యార్ హై'లో హృతిక్ డ్యాన్స్ చూసి నేను మెస్మరైజ్ అయ్యాను.

PolitEnt Media

PolitEnt Media

Next Story