Ashu Reddy Engagement Photos: అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్! అది నిజమా? లేక ప్రమోషనా?
అది నిజమా? లేక ప్రమోషనా?

Ashu Reddy Engagement Photos: టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అషురెడ్డి.. ఈ పేరు వింటేనే ఏదో ఒక వివాదం గుర్తుకొస్తుంది. నిన్నమొన్నటి వరకు గ్లామర్ షో, బోల్డ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ అమ్మడు రూ. 9.5 కోట్ల మోసం కేసులో ఇరుక్కుని హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం సెటిల్ అవ్వకముందే.. తాజాగా అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, ఒక అబ్బాయి చేతిని గట్టిగా పట్టుకుని తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే, ఆ అబ్బాయి ముఖాన్ని మాత్రం చూపించకుండా కేవలం ఒక 'కెమెరా ఎమోజీ'ని క్యాప్షన్‌గా పెట్టి సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీంతో ఇది నిజంగానే నిశ్చితార్థమా? లేక ఏదైనా వెబ్ సిరీస్ ప్రమోషనా? అని నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఒకవైపు ఫోటోలతో హడావుడి చేస్తున్నా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కేసుల సెగ అషును వెంటాడుతూనే ఉంది. లండన్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఏకంగా రూ. 9.5 కోట్లు వసూలు చేశారని బాధితుడి తండ్రి హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో స్టే ఇవ్వడానికి హైకోర్టు కూడా నిరాకరించడంతో అషురెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు.. "ప్రస్తుతానికి కోటిన్నర ఇస్తాను.. లేదంటే ఫేక్ వేధింపుల కేసులు పెడతా" అంటూ అషురెడ్డి బెదిరించినట్లు ఉన్న ఆడియో రికార్డింగ్‌లు బయటపడటం సంచలనం రేపింది.
ఈ వివాదం ముదురుతున్న వేళ, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డికి గట్టి షాకిచ్చారు. అషుతో పాటు ఆమె తల్లిదండ్రులకు 41A నోటీసులు జారీ చేస్తూ.. వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అటు పోలీసులు.. ఇటు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు.. అషురెడ్డి లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

