Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి.. కేసు కొట్టేయ్యాలని పిటిషన్
కేసు కొట్టేయ్యాలని పిటిషన్

Ashu Reddy: సినీ నటి అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న హనీట్రాప్ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కనీసం తన వివరణ కూడా తీసుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, కేవలం తన గౌరవానికి భంగం కలిగించడానికే ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, వాస్తవాలను దాచిపెట్టి ఈ కేసు పెట్టారని ఆమె తన పిటిషన్‌లో స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏమిటి?
నటి అషు రెడ్డి 2018 నుండి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దాదా రూ.9.35 కోట్ల నగదు, 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు, ఫ్లాట్లు వసూలు చేసినట్లు ధర్మేంద్ర తండ్రి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తరుణంలో అషు రెడ్డి కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

