ఆగస్టు 9న అతడు

Athadu: సూపర్ స్టార్ మ హేష్ బాబు, త్రిషా కృష్ణన్ హీరోహీరోయిన్లుగా 2005లో వచ్చిన సినిమా అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై దుగ్గిరాల కిషోర్, ఎం రామ్మోహన్ ఈ సినిమాను నిర్మించా రు. ఈ మూవీలో సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రమ ణ్యం, హేమ, సుధ తదితరులు నటించారు. ఈ సినిమా మరోసారి లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ది. ఇప్పటి వరకు టెలివిజన్లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా రికార్డు సంపాదించుకొన్నదీ సినిమా. ఈ మూవీ ఇప్పటికీ ఎన్నో సార్లు ప్రసారమై ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచింది. ఇప్పటికీ ఆ సినిమా వస్తే.. చాలా మంది టీవీలకు హత్తుకుపోయి చూస్తారు. ఈ సినిమాకు మూడు నంది అవార్డులు దక్కాయి. అతడు సినిమాను 4కే, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4కే ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారు. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ప్రేక్షకులు భారీ అంచనాలతో రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించేసరికి ఓ అరగంట గడవడంతోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి కథ నచ్చకపోవడంతో ఆయన చేయలేదు. తర్వాత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి నటించారు. హీరోయిన్ పాత్రను అప్పటికి వర్షం సినిమాతో మంచి విజయం అందుకున్న త్రిషకి ఇచ్చారు. ఇక సినిమాలోని 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి పాత్రను ముందుగా శోభన్ బాబుతో చేయించాలని నిర్మాత మాగంటి మురళీమోహన్ ఆశించారు. అందుకోసం ఆయనకు బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. అయితే తిరిగి నటించనని శోభన్ బాబు నిరాకరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story