మూడు గంటల 15 నిమిషాల దృశ్యకావ్యం

Avatar 3 Runtime Sets New Record: హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్ అభిమానులకు మరో ఉత్కంఠభరితమైన అప్‌డేట్ ఇచ్చారు. ఆయన సృష్టిస్తున్న దృశ్య కావ్యం అవతార్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా రానున్న అవతార్: ఫైర్ అండ్ ఆష్ చిత్రానికి సంబంధించి అధికారిక రన్‌టైమ్‌ను ప్రకటించారు. ఈ చిత్రం ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో రానుంది. దీంతో అవతార్ సిరీస్‌లోనే ఇది అత్యంత అధిక నిడివి గల చిత్రంగా రికార్డు సృష్టించనుంది. గతంలో వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ రికార్డును ఇది అధిగమించనుంది.

కొత్త విలన్ వరాంగ్ పరిచయం

పండోరా గ్రహం నేపథ్యంలో సాగే ఈ కథలో ఈసారి ఒక కొత్త విలన్‌ను పరిచయం చేయబోతున్నారు. వరాంగ్ అనే ఈ నావి పాత్రలో నటి ఊనా చాప్లిన్ కనిపించనుంది. పండోరా జీవధార అయిన ఐవాను వ్యతిరేకించే తొలి నావి పాత్ర ఇదే కావడం కథలో కీలక మలుపు కానుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. ఈ మూడో భాగం గత చిత్రాల కంటే మరింత ఉత్కంఠభరితంగా, భావోద్వేగభరితంగా, భారీ స్థాయిలో ఉంటుందని తెలిపారు.

విడుదల తేదీ, తారాగణం, ఫ్యూచర్ ప్లాన్స్

'అవతార్: ఫైర్ అండ్ ఆష్' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న విడుదల కానుంది. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ వంటి పాత తారాగణంతో పాటు కొత్తగా ఊనా చాప్లిన్ కీలక పాత్రలో భాగమయ్యారు. కామెరూన్ ఈ సిరీస్‌ను మొత్తం ఐదు భాగాలుగా ప్లాన్ చేశారు. అవతార్ 4ను 2029లో అవతార్ 5ను 2031 డిసెంబర్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story