పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Avatar 3 Wonder: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శకులలు పలువురు సోషట్ మీడియాలో తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. ఈ సినిమా టాక్ ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. విజువల్స్ పరంగా జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతం చేశారని కొందరు అంటుంటే, కథలో కొత్తదనం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్లస్ పాయింట్స్

ఎప్పటిలాగే జేమ్స్ కామెరూన్ పండోరా ప్రపంచాన్ని అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా యాష్ పీపుల్ (అగ్ని తెగ), అగ్నిపర్వతాల నేపథ్యంలో వచ్చే విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.క్లైమాక్స్ యాక్షన్ సీన్ ,కొత్త తెగతో జరిగే యుద్ధం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. జేక్ సల్లీ కుటుంబం పడే వేదన, కుటుంబ బంధాలను ఈ సినిమాలో మరింత లోతుగా చూపించారు. కొత్తగా పరిచయమైన నెగటివ్ క్యారెక్టర్ 'వరాంగ్' (ఊనా చాప్లిన్) నటన బాగుంది.

మైనస్ పాయింట్స్

సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల 17 నిమిషాలు. చాలా చోట్ల సినిమా నెమ్మదిగా సాగుతూ, సాగదీసినట్లు అనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. కథ , కథనంలో పెద్దగా మార్పులు లేవని, రెండో భాగం (The Way of Water) లాగే ఉందని విమర్శలు వస్తున్నాయి. కొన్ని సీన్లు మునుపటి భాగాలను గుర్తుచేస్తున్నాయని టాక్.అంతర్జాతీయ వెబ్‌సైట్లు ఈ సినిమాకు మొదటి రెండు భాగాల కంటే తక్కువ రేటింగ్ ఇచ్చాయి.

ఇండియాలో విజువల్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నప్పటికీ, మునుపటి సినిమాలకు ఉన్నంత హైప్ ఈసారి కొంత తగ్గిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అయినప్పటికీ, IMAX 3D లో ఈ సినిమాను చూడటం ఒక గొప్ప అనుభూతి అని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.మీరు విజువల్ వండర్స్, అవతార్ ప్రపంచాన్ని ఇష్టపడే వారైతే, ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో (అందులోనూ 3Dలో) చూడవచ్చు. అయితే, బలమైన కథను ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story