'బేబమ్మ

Director Anil Ravipudi’s Upcoming Film: వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే సస్పెన్స్‌కు అనిల్ రావిపూడి తెరదించారు.

హైదరాబాద్‌లో జరిగిన "లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)" ప్రమోషనల్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కృత్తి శెట్టి ఒక కథానాయికగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తనదైన స్టైల్‌లో స్పందిస్తూ.. "మేము అధికారికంగా చెప్పకముందే మీడియా మిత్రులు ఈ విషయాన్ని రాసేశారు. కృత్తి.. త్వరలోనే మనం షూటింగ్ సెట్స్‌లో కలుద్దాం" అని ఆయన అనడంతో అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.

ఈ సినిమాలో కృత్తి శెట్టి, నందమూరి కల్యాణ్ రామ్‌కు జోడీగా నటించబోతోంది. మరోవైపు, వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'LIK' ఏప్రిల్ 10న విడుదల కానుంది, ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగానే అనిల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story