ఎల్లమ్మ షూటింగ్‌లో షూస్ ధరించడంపై నెటిజన్ల ఫైర్

Balagam Venu in Controversy: వేణు యెల్దండి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎల్లమ్మ. తెలంగాణ గ్రామ దేవత నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పర్శి అనే మాస్ పాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ లోకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

అసలేం జరిగింది?

వేణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. ఆ ఫొటోల్లో తెలంగాణలోని ఒక పురాతన దేవాలయ ప్రాంగణంలో చిత్రీకరణ జరుగుతుండగా, వేణు కాళ్లకు షూస్ ధరించి ఉండటం నెటిజన్ల కంటపడింది. దేవాలయం వంటి పవిత్రమైన ప్రదేశంలో షూస్ వేసుకోవడం హిందూ సంప్రదాయాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే వేణు దీనిపై వివరణ ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, వేణుకు మద్దతుగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. సినిమా షూటింగ్ అంటే వందలాది ఎలక్ట్రికల్ వైర్లు, భారీ లైటింగ్ స్టాండ్‌లు ఉంటాయని.. సాంకేతిక నిపుణుల భద్రత దృష్ట్యా షూస్ ధరించడం సాధారణమని వారు వాదిస్తున్నారు. ఇది దైవ నింద కోసం చేసిన పని కాదని వారు సమర్థిస్తున్నారు. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఎల్లమ్మ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతుందని భావిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి నటుడిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండటం ఈ సినిమాకు మెయిన్ హైలైట్.

PolitEnt Media

PolitEnt Media

Next Story