బాలకృష్ణకు అరుదైన గౌరవం

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (UK) గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కింది. బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ గుర్తింపు లభించింది. ఈ నెల 30న హైదరాబాద్ లో బాలకృష్ణను సత్కరించనున్నారు.

బాలకృష్ణ తన సినీ జీవితంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటనకు, డైలాగ్ డెలివరీకి, యాక్షన్‌కు ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ గుర్తింపు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న గొప్ప స్థానాన్ని, సుదీర్ఘమైన , విజయవంతమైన కెరీర్‌ను తెలియజేస్తోంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటులలో ఆయన కూడా ఒకరు.

బాలకృష్ణకు ఈ ఏడాదిలోనే పద్మభూషణ్ అవార్డ్ దక్కింది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డ్ వచ్చింది. 1974లో తాతమ్మ కల మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story