కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకున్న 'బాలన్ - ద బాయ్' చిత్ర అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూసి అజయ్ దేవగన్, సూర్య, నాగచైతన్య ప్రశంసలు

భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు మాత్రమే అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల లిస్ట్‌లో తాజాగా చేరిన క్రేజీ ప్రాజెక్ట్ "బాలన్ - ద బాయ్" (Balan The Boy Trailer Review). ఇటీవల ప్రతిష్టాత్మక కేన్స్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లోని 'మార్చే డు ఫిల్మ్' (Marché du Film) విభాగంలో ప్రదర్శితమై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, తాజాగా తన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ క్రమంలో భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తూ ట్రైలర్‌ను లాంచ్ చేయడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్, టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కన్నడ నటుడు, దర్శకుడు రాజ్ బి. శెట్టి ఈ చిత్ర ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ, చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అజయ్ దేవగన్ ఏమన్నారంటే? (Ajay Devgn Reaction)
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. "సినిమా కథేంటో అస్సలు బయట పెట్టకుండా.. అదే సమయంలో ప్రేక్షకుడికి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఇంకా ఏదో చూడాలనే తపనను పెంచే ట్రైలర్లు రావడం చాలా అరుదు. ఈ ట్రైలర్ సరిగ్గా అదే మ్యాజిక్ చేసింది. 'బాలన్ ద బాయ్' చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ట్రైలర్‌ను వీక్షించాలని అజయ్ దేవగన్ రాసుకొచ్చారు. అజయ్ దేవగన్ లాంటి ఒక సీనియర్ స్టార్ హీరో సినిమా ట్రైలర్‌పై ఇంతటి సానుకూల స్పందన వ్యక్తం చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
https://www.instagram.com/reel/DZNSxXpIB1c/?utm_source=ig_web_button_share_sheet
సపోర్ట్‌గా నిలిచిన సౌత్ స్టార్స్
కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాకు చెందిన అగ్ర హీరోలు సైతం ఈ సినిమా కోసం ఏకమయ్యారు. తమిళ్ స్టార్ హీరో సూర్య, తెలుగు హీరో నాగచైతన్య, కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తూ మేకర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక విభిన్నమైన, హృదయానికి హత్తుకునే సినిమాను ఇండియన్ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నందుకు చిత్ర బృందాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ టాప్ స్టార్స్ మద్దతు లభించడంతో 'బాలన్ - ద బాయ్' చిత్రం పాన్-ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రైలర్ ఎలా ఉందంటే? (Balan The Boy Trailer Review)
'బాలన్ - ద బాయ్' ట్రైలర్ ప్రేక్షకుడికి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ చూస్తే ఇదొక డీప్ హ్యూమన్ ఎమోషన్స్, ఐడెంటిటీ (అస్తిత్వం), బిలాంగింగ్ (కలిసి జీవించడం), సర్వైవల్ (బతుకు పోరాటం) చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. సినిమాలో సస్పెన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయి. మనిషి భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరిస్తూనే, ఉత్కంఠ రేకెత్తించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. కథను ఎక్కువగా రివీల్ చేయకుండానే ప్రేక్షకుడిని కట్టిపడేసేలా విజువల్స్ ఉన్నాయి.
క్రేజీ కాంబినేషన్
ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లేను ప్రముఖ రచయిత, దర్శకుడు జితు మాధవన్ అందించారు. పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, గుర్తింపు ఉన్న ఈ ఇద్దరు అగ్ర క్రియేటర్స్ చేతులు కలపడంతో, సినిమా ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అందుకు తగ్గట్టే ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.
విడుదల తేదీ
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సౌత్ ఇండియాలోనే లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), థెస్పియన్ ఫిల్మ్స్ (Thespian Films) సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. క్వాలిటీ కంటెంట్‌తో సినిమాలు తీసే ఈ రెండు బ్యానర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా వరల్డ్ క్లాస్ అవుట్‌పుట్‌తో రాబోతోంది. సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2026, జూన్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. మల్టీ-లాంగ్వేజ్ చిత్రంగా రూపొందిన 'బాలన్ ద బాయ్' ఏకకాలంలో మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.

