డేట్ చెప్పేసిన బాలయ్య

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదల వాయిదా పడింది.

లేటెస్ట్ గా బాలకృష్ణ మూవీ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు. అఖండ 2' సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి కేటాయించిన సమయం సరిపోలేదని, అందువల్ల విడుదల వాయిదా పడిందని ఆయన వివరించారు.

'అఖండ' సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'అఖండ 2' దానికంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని, ఈ సినిమాను మంచి ఉద్దేశంతో తీశామని బాలకృష్ణ అన్నారు. 'అఖండ' మొదటి భాగం విజయం సాధించడంతో, 'అఖండ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story