మనసు విప్పిన సమంత..

Actress Samantha: నటి సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను దాటుకుని, మళ్ళీ సంతోషాన్ని వెతుక్కున్న తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. విడాకుల తర్వాత కలిగిన మానసిక క్షోభ నుండి, రాజ్‌ నిడిమోరుతో కొత్త జీవితం వరకు తన ప్రయాణాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్‌గా పంచుకున్నారు. 2021లో విడాకుల తర్వాత సమంత పూర్తిగా కుంగిపోయారు. ఆ సమయంలో తన పరిస్థితిని వివరిస్తూ ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు

"జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని, మళ్ళీ ప్రేమలో పడతానని కలలో కూడా అనుకోలేదు. ఎవరి స్నేహాన్ని లేదా ప్రేమని స్వీకరించే స్థితిలో తాను లేనని, ఆ సమయంలో పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయానని సామ్ గుర్తు చేసుకున్నారు. 2025 డిసెంబరులో దర్శకుడు రాజ్‌ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, తన మార్పుకు ఆయనే కారణమని కొనియాడారు. "రాజ్‌ నా జీవితంలోకి వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. ఆయన వల్లే నేను ఒక బెటర్ పర్సన్ గా మారాను" అని సమంత సంతోషం వ్యక్తం చేశారు.

స్నేహితురాలి మెసేజ్.. కళ్ళకు కట్టిన నిజం

ఇటీవల తన పాత స్నేహితురాలిని కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "నువ్వు ఒకప్పుడు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదానివి.. కానీ ఇప్పుడు మళ్ళీ పాత సమంతలా మామూలుగా కనిపిస్తున్నావు" అని తన స్నేహితురాలు పంపిన వాయిస్ మెసేజ్ విన్నప్పుడు తనలో వచ్చిన మార్పు తనకే అర్థమైందని సమంత నవ్వుతూ చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story