Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత అందమైన, సరికొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిదిమోరును వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తల్లి కాబోతున్నానంటూ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన "మా ఇంటి బంగారం" సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో బేబీ బంప్‌తో మెరిసిన సామ్.. తాజాగా తన ప్రెగ్నెన్సీ జర్నీపై కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. "నేను ఎప్పటి నుంచో తల్లిని కావాలని కలలు కంటున్నాను. ఈ క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూశాను. అందుకే ఈ మాతృత్వపు ప్రయాణానికి నా వంద శాతం శ్రమను, ప్రేమనందిస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ అనేది తనకు చాలా కొత్తగా, ఎగ్జైటింగ్‌గా ఉందని.. ఇది తనలో ఒక సరికొత్త శక్తిని, జీవితానికి ఒక బలమైన మార్గాన్ని (Purpose) ఇచ్చిందని సామ్ ఆనందం వ్యక్తం చేసింది. నిత్యం ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, కృతజ్ఞతా భావంతో ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.

అలాగే కెరీర్ పరంగా కూడా స్పందించిన సమంత.. "మా ఇంటి బంగారం" చిత్రం తర్వాత తన ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మెటర్నిటీ లీవ్ (Maternity Leave) ముగిసిన తర్వాత సరికొత్త స్క్రిప్ట్‌తో మళ్లీ అభిమానుల ముందుకు వస్తానని హామీ ఇచ్చింది. క్రియేటివ్ ప్రాసెస్ ఎంత ముఖ్యమో.. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమే తనను ముందుకు నడిపిస్తుందని సమంత ఎమోషనల్ అయ్యింది.

మైయోసైటిస్ లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని.. ఇటు కెరీర్ లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తూ, అటు వ్యక్తిగత జీవితంలో తల్లి కాబోతున్న సమంతకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story