బెంగళూరు కోర్టు షాక్...

Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. కన్నడ భాషపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన కమల్..తమిళం నుంచే కన్నడ పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కన్నడ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు మహేశ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ నిన్న వ విచారించిన కోర్టు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని నిందించేలా మాట్లాడరాదు. సోషల్ మీడియా గానీ, ఇతర వేదికలపై గానీ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కమల్ ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 30కి వాయిదా వేసింది.

మరో వైపు జూన్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానికితోడు మణిరత్నం నాసిరకం వర్క్ అని ఓ రేంజ్లో ఆడియన్స్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడీ థగ్ లైఫ్ సినిమా జులై 3న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ అందుబాటులోకి వచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story