Hari Hara Veera Mallu: ఆలస్యమైనా చరిత్ర సృష్టిస్తాం.. 'హరిహర వీరమల్లు' టీమ్
చరిత్ర సృష్టిస్తాం

Hari Hara Veera Mallu: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు' ఒకటి. ఈ మూవీ విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరు గుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 'అచం చలమైన ఓపిక, నమ్మకంతో ‘హరిహర వీరమల్లు' సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీకి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వివిధ కారణాల వల్ల ఆరోజు మూవీని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నం. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని దీనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలనేది మా ఆలోచన. ప్రతి ఫ్రేమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్న మై ఉన్నాం. అందుకే మరికొంత టైం తీసుకుంటున్నం. మీ ఎదురుచూపులకు గిఫ్ట్ గొప్ప మూవీని అందిస్తామని హామీ ఇస్తున్నం' అని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలను ఏమాత్రం నమ్మవద్దని కోరింది. అంతేకా కుండా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని వెల్లడించింది. ‘హరిహర వీరమల్లు' చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించ డానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ, చరిత్ర సృష్టించేందుకు హరిహర వీరమల్లు సిద్ధం అవుతు న్నాడని చెప్పారు. ఇక ఈసినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ.ఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియ స్లో భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
