యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్

Betting Apps Promotion Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్, మరో యాంకర్ అమృత చౌదరి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ముగ్గురినీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

నిధి అగర్వాల్ ‘జీత్ విన్’ అనే బెట్టింగ్ సైట్‌ను ప్రమోట్ చేశారు. శ్రీముఖి ‘జంగిల్ రమ్మీ’ యాప్‌ను, అమృత చౌదరి పలు గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల చిట్టాలను సేకరిస్తూ సీఐడీ అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతు తదితరులను సీఐడీ సిట్ విచారించింది.

ఆర్థిక లావాదేవీలపైనే ప్రధాన దృష్టి

సీఐడీ సిట్ అధికారులు ప్రస్తుతం ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రమోషన్ల కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఖాతాల్లో జమ అయింది? హవాలా మార్గాల ద్వారా చెల్లింపులు జరిగాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రముఖులు కేవలం ప్రచారకర్తలుగానే ఉన్నారా? లేక అంతకంటే ఎక్కువ పాత్ర ఉందా? అనే కీలక కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story