రవితేజ మార్క్ కామెడీ

‘Bhartha Mahashayulaku Vignapthi’ Teaser: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్ అయింది. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ నెటిజన్లను, ముఖ్యంగా వివాహితులను బాగా ఆకట్టుకుంటోంది. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. పెళ్లయిన తర్వాత మగవారు ఎదుర్కొనే ఇబ్బందులను, భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలను కామెడీగా చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ నేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన మార్క్ కామెడీ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.టీజర్ చూస్తుంటే, కేవలం నవ్వులే కాకుండా భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్‌గా కూడా చూపిస్తారని అర్థమవుతోంది.మగాడు పెళ్లికి ముందు పులి.. పెళ్లయ్యాక ఎలుక" అనే పాత డైలాగ్‌ను కొత్త కోణంలో, సరదా సన్నివేశాలతో ఇందులో చూపించారు. ముఖ్యంగా భర్తల తరపున చేసే విన్నపాలు నవ్వు తెప్పిస్తున్నాయి.టీజర్ రిలీజ్ తర్వాత దీనిపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. 'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' వంటి చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న టాలెంటెడ్ టీమ్ ఈ సినిమా వెనుక ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story